Robbery in Temples: శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామంలో దొంగలు ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. మైలాల మల్లన్న గుడిలోని అమ్మవారి పుస్తె మట్టెలు రూ.15 వేల మేర ఉండగా, హుండీలోని సుమారు రూ.20 వేల ఆదాయం అపహరించారు. అదే గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో హుండీలో సుమారు రూ.20 వేల నగదు, రూ.25 వేల విలువైన పుస్తె మెట్టెలు దొంగలు ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం రానుందని పోలీసులు వెల్లడించారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం:
