SSC RESULTS : టెన్త్ ఫలితాల్లో రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటినట్లు కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. కోయడ హర్షిత 555, ఎల్లమ్మల ప్రసన్న 552, మొగుళ్ల అస్మిత 547, మొగుళ్ల వైష్ణవి 547, మల్లాపురం హర్షవర్ధన్546, కముటం తనుష్ 541 మార్కులు సాధించారన్నారు. 26 మంది విద్యార్థుల్లో 19 మంది 500 మార్కులకు పైగా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం అభినందించారు.
– శెనార్తి మీడియా, రామడుగు :