Police Serching: షబ్ -ఎ- ఖద్ర్ – జగ్ నే కి రాత్ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ గురువారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ముస్లింలతో సమావేశమయ్యారు. పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలన, మత సామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
రైల్వే స్టేషన్‌తో పాటు పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాలను పరిశీలించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉంటే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పై చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల: