ANTI THEFT ALARAM LOCK
యాంటీ థెఫ్ట్ అలారం చూపిస్తున్న సీపీ శ్రీనివాస్

ANTI THEFT ALARAM LOCK : యాంటీ థెఫ్ట్ అలారంతో దొంగలకు భయం

  • సాంకేతిక అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి
  • పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

ANTI THEFT ALARAM LOCK : గృహాల కోసం యాంటీ తెఫ్ట్ అలారం లాక్, తలుపులు, కిటికీలపై మాగ్నెటిక్ యాంటీ థెఫ్ట్ అలారం పై ప్రజలకు అవగాహన కల్పించి నేరాల నియంత్రణ కోసం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లాక్స్ వినియోగించుకోవడం ద్వారా చోరీలను అదుపుచేయవచ్చని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వాటివరకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ డివైస్ పైనే ఆధారపడి ఉంటున్నాం. అనునిత్యం మన జీవన విధానంలో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది. సైరన్ అలారాలు మీ ఇంటిలోనికి ఎవరైనా చొరబడటానికి ప్రయత్నించినట్లయితే వారి ప్రయత్నంను ఆపే ఒక సమర్థవంతమైన నిరోధకం. అట్టి అలారం శబ్దం రావడం వలన చుట్టూ ప్రక్కల వారిని కూడా అలర్ట్ చేస్తుంది. తద్వారా దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి భయపడి తన ప్రయత్నం విరమించు కుంటాడు. నేరాల నియంత్రణలో సాంకేతికత అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. ఇంటికి తాళాలు వేసి బయటకు, ఊర్లకు వెళ్లే వారంతా గృహాల కోసం యాంటీ తెఫ్ట్ అలారం లాక్, తలుపులు మరియు కిటికీలపై మాగ్నెటిక్ యాంటీ థెఫ్ట్ అలారం పరికరాల సేవలను ఉపయోగించుకోవాలి. తద్వారా చోరీలకు పాల్పడే నిందితుల ప్రయత్నం ను విరామించుకొనేలా ఆకస్మికంగా వాటి నుండి వచ్చే అలారం శబ్దంతో భయం కలిగేలా చేయడం జరుగుతుంది అన్నారు. డోర్ అలారాలు చాలా ప్రభావవంతమైన గృహ భద్రతా పరికరాలు, ఎవరైనా మీ ఇంటి తలుపులు తెరిస్తే లేదా తెరవడానికి ప్రయత్నించినప్పుడు అలారం సౌండ్ తో హెచ్చరిస్తాయి. మీరు మీ ఇంటిలోని అన్ని డోర్‌లకు (గ్యారేజ్ డోర్స్, సైడ్, బ్యాక్ డోర్స్, గ్లాస్ గార్డెన్ డోర్స్, సెల్లార్ డోర్స్, సేఫ్ డోర్స్, కార్యాలయాలు, గిడ్డంగులు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక ప్రాంతాలు, నివాస గృహాలు మరియు గ్యారేజీలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లతో సహా వాణిజ్య ప్రాంగణాలు, ఏదైనా నిల్వ ఉంచే సౌకర్యాలు ఉన్న ప్రాంతం లో మొదలైనవి) డోర్, విండో అలారాలను అటాచ్ చేసుకోవచ్చు. అదేవిదంగా మీ ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలపై విండో అలారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ అలారం సెక్యూరిటీ గ్యాడ్జెట్‌ అలారం సిస్టమ్‌, బజర్‌, బ్యాటరి లు లభిస్తాయి. దీనిని ఎలా ఉపయోగించాలి అనేది సొంతంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి తెలుసుకోవచ్చు అన్నారు. దీని బజర్‌ ఏకంగా 105 నుండి 110 వరకు డీబీతో మోగుతుంది. చాలా దూరం వరకు ఈ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో ఎవరైనా లాక్ ,డోర్,విండో తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి తదితర ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ యాంటీ థెఫ్ట్‌ అలారంలు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే కంపెనీ బట్టి రూ. 300 నుంచి రూ. 500లో ఈ గ్యాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ దామోదర్, పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరిఖని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *