TGMS
టీజీఎంఎస్ లో బోనాలతో టీచర్లు, విద్యార్థులు

MODEL SCHOOL :  మోడల్ స్కూల్ లో బోనాల పండుగ సందడి

 

MODEL SCHOOL : మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ (RAJEEV NAGAR) లోని తెలంగాణ మోడల్ స్కూల్ ( TG MODEL SCHOOL )లో మంగళవారం ఆషాడ మాసం బోనాల పండుగతో పాటు గోరింటాకు వేడుకలు తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.

TGMS TEACHERS
బోనాలతో నృత్యాలు చేస్తున్న టీచర్లు, విద్యార్థులు

బోనాల పండుగ వేడుకలను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ (COLLEGE PRINCIPAL) ముత్యం బుచ్చన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలని కోరారు. బోనాలు పండుగ మహంకాళి దేవికి అంకితం చేసిన హిందూ పండుగ అని, ఈ పండగ సందర్భంగా కృతజ్ఞతా రూపంగా దేవతకు బోనాలు (ప్రత్యేక భోజనం) సమర్పిస్తారని, దీనిని ఆషాడ మాసంలోనే (జూలై లేదా ఆగస్టు నెలలో) మాత్రపు జరుపుకుంటారని వివరించారు.

GORINTAAKU
గోరింటాకు వేడుకలలో అధ్యాపకులు, విద్యార్థులు

బోనాల పండుగ, మెహందీ వేడుకలను విద్యార్థులు, మహిళా టీచర్లు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ సాంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింభించేలా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గోరింటాకు పెట్టుకొని మెహందీ వేడుకలలో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *