Double Ismart
Double Ismart

Puri Jagannath: పూరీ ప్లాఫ్ మూవీకి వంద మిలియన్ల వ్యూస్!

Puri Jagannath: రామ్‌ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ తెరకెక్కించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పూరీతో పాటు హీరో రామ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతకు ముందు వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పూరీ, రామ్ తో పాటు అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది.  ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ నటించినా థియేటర్లలో నిలబడలేకపోయింది. ఇస్మార్ట్‌ శంకర్‌ కన్నా మరింత బాగుంటుందని ప్రేక్షకులు ఆశించిన డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా  నిరాశ పర్చడంతో భారీ షాక్ ఇచ్చారు.

తెలుగులో కూడా తీవ్రంగా నిరాశ పరచిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ సినిమాను హిందీలో ఆర్‌కేడీ స్టూడియోస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా గత నెలలో  విడుదల చేశారు. యూట్యూబ్‌ ప్లాట్ ఫాంలో వచ్చిన 45 రోజుల్లోనే హిందీ డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీకి ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం. తెలుగు సినిమాలకు ఉత్తరాదిన మంచి డిమాండ్‌ ఉన్న విషయ తెలిసిందే. గతంలో చాలా తెలుగు సినిమాలు హిందీలో యూట్యూబ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వందల మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాల సంఖ్య చాలానే ఉంది. కానీ డబుల్‌ ఇస్మార్ట్‌ మాత్రం ఎంతో స్పెషల్‌గా నిలిచింది.

యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అయిన కేవలం 45 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు 1 మిలియన్‌ లైక్స్‌ను సైతం దక్కించుకోవడం మరో విశేషం. సినిమా గురించి దాదాపు 27 వేల మంది కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక తెలుగు సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌కు అతి
తక్కువ సమయంలో ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందడంతో పాటు సంజయ్ దత్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపారు.
రామ్‌ పోతినేని ప్రస్తుతం మహేష్‌ బాబు పీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాతలు చెబుతున్నారు.  భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. రామ్‌ పక్కింటి కుర్రాడు అన్నట్లు సింపుల్‌
లుక్‌లో కనిపించబోతున్నాడు.  త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాతో హిందీలో ఆకట్టుకున్న రామ్‌ తన కొత్త సినిమాతోనూ అక్కడ మెప్పిస్తాడో లేదో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *