- ఆదిలోనే కాండం తొలుచు పురుగును నివారించాలి
- ఏఈఓ ముత్యం తిరుపతి
CROP PROTECTION : వ్యవసాయ సాగులో రైతులు పంటలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తేనే సాధ్యమని మందమర్రి మండల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ముత్యం తిరుపతి అన్నారు. శుక్రవారం మండలంలోని నార్లాపూర్ లో వరి పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతులనుద్దేశించి పలు సూచనలు చేశారు. యాసంగి (YASANGI) సీజన్ లో వరి పంటలో కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంటుందని, రైతులు దీనిని ముందుగానే గుర్తించి సశ్య రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరి సాగులో యూరియా (UREA) అధిక మోతాదులో వాడటం వల్ల కాండం తొలుచు పురుగు ఉధృతి అధికమవుతుందని, దీనితో పంట దిగుబడి 60 నుంచి 70 శాతం తగ్గే అవకాశముందన్నారు. కాండం తొలుగు పురుగును నివారించేందుకు నాటు వేసిన 15 రోజుల్లోనే పురుగు ఉధృతిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఏఈఓ (AEO) తిరుపతి అన్నారు. పురుగు ఉధృతి నివారణకు ఎకరానికి 10 కిలోల కార్బోఫిరాన్ 3జీ గుళికలు, లేదా ఎకరానికి 8 కిలోల కాంటబెట్రో ఫ్లోరైడ్ 4జీ గుళికలు, లేదా క్లోరంతనెల్లి ఫ్లోర్ 4 కిలోలు ఇసుక(SAND)లో కలిపి పొలంలో నీరు పలుచగా ఉంచి చల్లుకోవాలని సూచించారు.
డిజిటల్ క్రాఫ్ట్ సర్వే (DIGITAL CROP SURVEY)కు మండల రైతులు సహకరించాలని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ముత్యం తిరుపతి కోరారు. ప్రతి సర్వే నెంబర్ (SURVEY NUMBER), సబ్ డివిజన్ (SUB DIVISION)లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు అరికటి రవీందర్, చిటవేణి అనిల్, ఎరా గోపాల్, చిలారపు రమేష్, కుమ్మరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :