Kotapalli SI : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు కోటపల్లి ఠాణా ఎస్‌ఐ రాజేందర్ హాజరయ్యారు. పోలీస్ శాఖ పరంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలలో భాగంగా అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
సాధారణంగా హిందూ ఉత్సవాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శన సౌకర్యం కల్పించేందుకు నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో అధికారులు లేదా పోలీసులు భక్తులపై ఏ కొంచెం అసహనం ప్రదర్శించిన వారి మనోభావాలు దెబ్బతింటాయి.
కానీ ఇక్కడ ఎస్ఐ రా జేందర్ భక్తులతో కలిసిపోయి చాలా ఒపిగ్గా సేవలందించారు. వేడుకల్లో తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. ప్రజల అవసరాల పట్ల స్పందన చూపుతూ, అవసరమైతే వ్యక్తిగతంగా ముందుకు వచ్చి సహాయం చేయడం, ఇలాంటి ఉత్సవాల్లో సన్నిహితంగా పాల్గొనడం ద్వారా ‘పోలీసులు కూడా మనవాళ్లే’ అనే భావన బలపడుతోందని కొందరు వాఖ్యానిస్తున్నారు. సామాజిక బాధ్యతగా ఎస్ఐ విధంగా సేవలు అందించడాన్ని పలువురు ప్రశంసించారు.
శెనార్తి మీడియా, కోటపల్లి (మంచిర్యాల):