- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ షేక్ ఖాసీం
ROAD SAFETY MONTH : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఏఎంవీఐ) షేక్ ఖాసీం సాహెబ్ కోరారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధ వారం లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని విద్యార్థులతో పాటు బీసీ రెసిడెన్సియల్ పాఠశాలల విద్యార్థులకు రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

బాలబాలికలకు రహదారి భద్రతా సూచనలు అందజేశారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ సూర్య తేజ, ప్రిన్సిపాల్స్ బొడ్డు శ్రీనివాస్, కేజే రాణి, బ్రహ్మజ, రవాణా సిబ్బంది రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
