- హార్ట్ ఎటాక్ రోగులకు క్యాథ్ ల్యాబ్ వరం…
- కార్జియోలాజిస్ట్ డాక్టర్ రాజేష్ భుర్కుండే
TOUCH HOSPITAL : హార్ట్ ఎటాక్ కు గురైన వ్యక్తి గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలు కాపాడవచ్చునని కార్జియోలాజిస్ట్ డాక్టర్ రాజేష్ భుర్కుండే అన్నారు. ఇటీవల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, చాతిలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగి రికవరీ అయిన సందర్భంగా మంగళ వారం టచ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హార్ట్ ఎటాక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి అని, సరైన సమయానికి చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చునని అన్నారు. గుండే నొప్పితో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తికి టచ్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ లో వెంటనే అధునాతన వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందించామని, ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యవంతుడయ్యారన్నారు. ఈ సందర్భంగా హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు.

హార్ట్ ఎటాక్ వచ్చిన రోగులలో 50 శాతం మంది ఆసుపత్రికి చేరక ముందే మరణిస్తున్నారని, ఆసుపత్రిలో చేరిన వారిలో కూడా, తీవ్రమైన హార్ట్ ఎటాక్ తో 90 శాతం మరణిస్తుంటారన్నారు. ఛాతిలో నొప్పికి గోల్డెన్ అవర్ చాలా కీలకమని, నొప్పి వచ్చిన తర్వాత గంటలోపే ఆసుపత్రికి చేరితే, ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని, ఆలస్యమయితే గుండె కండరాలకు శాశ్వత నష్టం ఏర్పడి ప్రాణ నష్టానికి దారితీస్తుందన్నారు. గోల్డెన్ అవర్ లో టచ్ హాస్పిటల్ కు వంద శాతం బ్లాకేజ్ అండ్ బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టి వచ్చిన రోగి ప్రాణాలను కాపాడగలిగామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైద్యులు బిల్లా వికాస్, రాజు పాల్, అథార్, ఇన్చార్జి మాటేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘టచ్’ వైద్యులు నాన్నకు ప్రాణం పోశారు - సిరిపురం ప్రవీణ్
జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నివాముంటున్న సింగరేణి రిటైర్డ్ కార్మికుడు సిరిపురం సాయిలు (65)కు ఒక్క సారిగా నరాల సమస్యతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో టచ్ ఆసుపత్రిలో చేర్పించాం. వైద్యులు ఎంజియోగ్రామ్, ఈసిజీ పరీక్షలు నిర్వహించి గుండెలో తీవ్ర సమస్య ఉందని గుర్తించారు. గుండెకు మూడు స్టంట్స్ వేయాల్సి వస్తుందని వివరించి నా అంగీకారంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించి నాన్న ప్రాణాలు కాపాడారు. మరోవైపు బ్రయిన్ లో రక్తం గడ్డ కట్టిన విషయాన్ని వైద్యులు ముందుగా గుర్తించడంతో పక్షవాతం నుంచి నాన్నను కాపాడుకోగలిగాం. ఒకేసారి మూడు స్టంట్స్ వేసి విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన టచ్ హాస్పిటల్ వైద్యులకు మా కుటుంబ సభ్యులం రుణపడి ఉంటాం. మా నాన్నను తిరిగి ఆరోగ్యంగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.

- శెనార్తి మీడియా, మంచిర్యాల :