- సరస్వతి హైస్కూల్ హెచ్ఎం ఉప్పుల శ్రీనివాస్
Science Day : సైన్స్ తోనే మానవ మనుగడ సాధ్యమని సరస్వతి హైస్కూల్ హెచ్ఎం ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో శనివారం నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్స్ సీవీ.రామన్ (Sir CV Raman)చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర మరువలేనిదని, బయాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ మాత్రమే సైన్స్ కాదని, సృష్టిలో ప్రతిదీ సైన్స్ తోనే ముడిపడి ఉందనే వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక శాస్త్రీయత దాగి ఉంటుందనేది పరిశీలన, ప్రయోగాల ద్వారానే నిరూపించవచ్చన్నారు. రామన్ ఎఫెక్ట్(Raman Effect) భారతదేశానికి ఎంతో మంచి పేరును తీసుకువచ్చిందని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథంతో చదివితే ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందన్నారు. నోబెల్ ప్రైజ్ సాధించిన రామన్ మన దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులు ప్రదర్శనకు ఉంచిన మోడల్స్ను పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, టీచర్స్ పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, రామడుగు