COTTON SEEDS
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రవి కుమార్

DUPLICATE COTTON SEEDS : మల్లీడిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత…

  • ఐదుగురి అరెస్ట్

DUPLICATE COTTON SEEDS : మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లీడిలో పోలీసులు, వ్యవసాయ అధికారులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమ వారం భీమిని పోలీస్ స్టేషన్ లో బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అధికారులకు అందిన సమాచారం మేరకు సోమ వారం ఉదయం మల్లీడి క్రాస్ రోడ్ వద్ద భీమిని ఎస్సై విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులతో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పల్సర్ వాహనం(టీఎస్ 20 బీ2977) పై అనుమానాస్పదంగా కనిపించగా వారిని ఆపే క్రమంలో ఒకరు పారిపోగా రెండు మూటలతో ఇద్దరు పట్టుబడ్డారన్నారు. మూటలను పరిశీలించగా అందులో 2.74 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ రూ. 6 .5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

అమ్మేందుకు వెళ్లి పట్టబడ్డారు…
నకిలీ పత్తి విత్తనాలను పురుషోత్తం, సురేష్ (గుంటూరు) లు కలిసి దహేగాం మండలం హత్తినికి చెందిన రాజన్న ఇంటి వద్ద కొన్ని రోజుల క్రితం మూడు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు దాచి ఉంచారు. ఇందులో నుంచి 50 కిలోలు పోషం, అతని స్నేహితుడు కృష్ణలు కలిసి వడాల గ్రామంలోని కొంత మందికి అమ్మేందుకు హత్తిని నుంచి పల్సర్ బైక్ పై తీసుకొని వస్తుండగా మల్లిడి క్రాస్ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.

విచారించి అదుపులోకి…
నకిలీ పత్తి విత్తనాలతో పట్టుబడిన పోషం, కృష్ణల సహాయంతో హత్తిని గ్రామానికి వెళ్లి పోలీసులు రాజన్న ఇంట్లో నిల్వ ఉంచిన 2.27 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. నకిలీ పత్తి విత్తనాల దంధా నడుపుతున్న పురుషోత్తం (గంగాపూర్, చింతల మానేపల్లి మండలం) నుంచి 47 కిలోల పత్తి విత్తనాలు, పోశం (అంకోడ, చింతల మానెపల్లి) నుంచి రవాణాకు ఉపయోగించిన పల్సర్ వాహనం, రాజన్న (హత్తిని) ఇంట్లో నిలువ ఉంచిన 2.27 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేయడంతో పాటు అక్రమ దందా నడుపుతున్న కృష్ణ (చింతల మానేపల్లి), సురేష్ (గుంటూరు, ఆంధ్రప్రదేశ్) లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ రూ. 6 లక్షల 50 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసిపి రవికుమార్ హెచ్చరించారు. చాకఛక్యంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్న వారిని పట్టుకున్న భీమిని ఎస్సై విజయ్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *