- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
- ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లలకు హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్
- ర్యాంక్ స్టార్స్ అలంకరించి అభినందించిన సీపీ
Promotions in Police Department :పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్మ్ డ్ విభాగం లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లు గా ప్రమోషన్లు పొందారు. వారిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు. కమిషనరేట్ లో ర్యాంక్ స్టార్లు అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ప్రమోషన్లతో పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందన్నారు. ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో మంచి పనితీరు చూపి ఉద్యోగోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖలో ఉద్యోగోన్నతితో పాటు బాధ్యత పెరుగుతుందన్నారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకం, గౌరవాన్ని పెంచేలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు .ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని చెప్పారు. కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించారో అదేవిధంగా మిగతా సర్వీసు కూడా పూర్తి చేసి మరిన్ని ప్రమోషన్లు పొందాలన్నారు .పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటామని, మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సీసీ తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐ వామన మూర్తి, రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని
