SARPANCH
రుమాళ్లు అందజేస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఉప సర్పంచ్ అనిల్ గౌడ్

HANDKERCHIEF DISTRIBUTION : శ్రమైక జీవనంలోనే సౌందర్యం

  • బీఆర్‌ఎస్‌ నేత పొన్నం అనిల్‌గౌడ్‌
  • హమాలీలకు చేతి రుమాళ్లు పంపిణీ

HANDKERCHIEF DISTRIBUTION : కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలవదని, కష్టపడి సంపాదించేది రూపాయి అయినా దానికి విలువ, గౌరవం ఉంటాయని బీఆర్‌ఎస్‌ నేత, మన్నెంపల్లి మాజీ ఉప సర్పంచ్‌ పొన్నం అనిల్‌ గౌడ్‌ అన్నారు. శ్రమైక జీవనంలో ఉన్న సౌందర్యం ఎందులోనూ ఉండదన్నారు. కార్మికులు, కర్షకులు కష్టపడి, కలిసి చేసే పని ఎంతో తృప్తి ఇస్తుందన్నారు. వేసవి కాలం మొదలైన నేపథ్యంలో గ్రామంలోని హమాలీ కార్మికులకు సోమ వారం చేతి రుమాళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్‌ గౌడ్‌ మాట్లాడుతూ, మార్చిలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయని, గ్రామంలో ఉండే హమాలీ కార్మికులు కష్టాన్ని నమ్ముకుని నిత్యం ఎండలోనే కష్టపడుతారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులందికీ హైక్వాలిటీ కాటన్‌ చేతి రుమాళ్లు పంపిణీ చేశామని తెలిపారు.

SARPANCH HANDKARCHIFS
హమాలీ సంఘం కార్మికులతో మాజీ ఉప సర్పంచ్ అనిల్ గౌడ్

కండువాలు అందించిన పొన్నం అనీల్‌ గౌడ్‌‌కు హమాలీ కార్మికులందరూ కతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు నాంపల్లి తిరుపతి, సానగొండ నరసింహస్వామి, నాంపల్లి శంకర్, దుర్గం జంపయ్య, కొలకాని రాజయ్య, పెద్ద చంద్రయ్య, బీనపల్లి సంపత్, కొలిపాక శ్రీనివాస్, నాంపల్లి పర్శరాములు, కొలిపాక మధు, మానుపాటి లక్ష్మయ్య, నాంపల్లి శంకర్, బీనపల్లి బాలయ్యతో గ్రామానికి చెందిన హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, తిమ్మాపూర్ : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *