Bjp Celebrations : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య(Malka Komuraiah) గెలుపుపై గన్నేరువరం మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో గుండ్లపల్లి (Gundlapalli) స్టేజీ వద్ద పటాకులు కాల్చి కాల్చారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా నికేశ్ మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభంజనం కొనసాగుతున్నదన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు బీజేపీకి పట్టం కట్టి, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమురయ్య గెలుపుతో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని నికేశ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ తరలిన నాయకులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమురయ్య భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన విజయోత్సవాలకు ఆ పార్టీ గన్నేరువరం మండలం అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్యర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుంటుక శంకర్, విలాసాగరం రామచంద్రం, రాజిరెడ్డి, కొలుపుల మహేందర్, అనిల్ రెడ్డి, పంబాల రాజశేఖర్, రామచంద్రం, సురేందర్, గాద వెంకన్న, గట్టు కిషన్, చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గన్నేరువరం