GMPS
GMPS:

GMPS: ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి

గొర్లు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్

GMPS: ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల తోనే అభివృద్ధి సాధిస్తామని జీఎంపి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్ అన్నారు. గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు గొర్ల కొమరయ్య యాదవ్ అధ్యక్షతన మండలంలోని సొసైటీ సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సంఘం సహకారం తో యాదవ, కురుమలు ఆర్థికంగా సామాజికంగా బలపడే అవకాశం ఉందని సహకార సంఘాలను నిర్వీర్యం చేయొద్దని తెలిపారు.

ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ(subsidy)లను పొందే అవకాశం సహకార సంఘాల ద్వారానే లభిస్తుందని సభ్యులు గ్రామాల్లో నూతన పాలకవర్గాలను ఎన్నుకొని జిల్లా యూనియన్ లో భాగస్వాములు కావాలని లేకుంటే వారు జిల్లా యూనియన్ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మండలంలో 18 సొసైటీ లు ఉండగా కేవలం 6 సంఘాల కు మాత్రమే ఎన్నికలు నిర్వహించారని మిగితా గ్రామాల్లో సొసైటీ లు ఎన్నికలకు దూరంగా ఉన్నాయని సహకార సంఘాల ఎన్నికల నియమావళి గురించి గ్రామాల్లో అధికారులు తెలుపక పోవడంతో ఎన్నికలు నిర్వహించుకోలేకపోయాయని అన్నారు.

ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లోని ప్రాథమిక గొర్రెల పెంపక దారుల సహకార సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవాలకు సంబంధించిన మందులు వ్యాక్సిన్లు మండల పశు వైద్యశాలలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేర్ల తిరుపతి యాదవ్, చేర్ల కోటయ్య యాదవ్, కన్నెవేని తిరుపతి యాదవ్ ,జినుక రాజయ్య యాదవ్,కేశవేన అయిలయ్య , కొత్తపల్లి రవి, మారవేని రాజయ్య, చెన్నవేని కనుకయ్య, మేడుదల అయిలయ్య, దొంగల తిరుపతి, గుండరపు అనిల్ , కొత్తపల్లి అశోక్, గడ్డి సంపత్, చెన్నవేని తిరుపతి,చేన్నవేని వెంకన్న, ముక్కెర కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, శంకరపట్నం :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *