HM SUSPEND : మంచిర్యాల జిల్లా వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తా శుక్ర వారం ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన 28 క్వింటాళ్ల బియ్యం కోటపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తీసుకున్నట్లు చూపించి 18 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రైవేటు వాహనంలో తరలించడం పై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అవకతవకులు జరిగినట్లుగా తేలడంతో హెచ్ఎం శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగిస్తూ ఐటీడీఏ పీఓ ఆదేశాలు జారీ చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :