APPRENTICESHIP FAIR : మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ(ITI)లో కళాశాల ఆవరణలో సోమ వారం కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ వై రమేష్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా (PRADHAN MANTRI NATIONAL APPRENTICESHIP FAIR) నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సోమ వారం ఏడు కంపెనీలకు అవసరమైన 242 అప్రెంటిషిప్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాకు 355 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

152 మంది ప్రాథమికంగా ఎంపిక…
చెన్నయ్ ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు 33 మంది, కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్ కు 25 మంది, హైదరాబాద్ వీ ఎల్ ఆర్ ఫెసిలిటీస్ కి 26 మంది, హైదరాబాద్ ప్రీమియర్ ఎనర్జీస్ కి 29 మంది, మంచిర్యాల ఆదర్శ ఆటోమొబైల్స్ కి 27 మంది, మంచిర్యాల శ్రీ బాలాజీ సర్వీసెస్ కి ఇద్దరు, హైదరాబాద్ ఎపక్ట్రానిక్స్ కి 10 మంది ఇలా మొత్తం 152 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి ఐటీఐ (ITI) ప్రన్సిపాల్ దేవానంద్, ట్రైనింగ్ ఆఫీసర్ (TRAINING OFFICER) దత్తాద్రి, డీటీఓ (DTO)లు వెంకటేశ్వర్లు, హఫీజ్, ఏటీవో (ATO)లు సోహెబ్, శశికుమార్, రామకృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధు (HR)లు మురుగన్, నాగరాజు, సునీల్, దిగ్విజయ్, రాహుల్, రవి, అమరేందర్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :