- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
COLLECTOR : జిల్లాలోని భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురు వారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
దివ్యాంగులకు మంజూరు చేసే యూడిఐడి ( UNIQUE DISABILITY IDENTIFICATION) కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రత్యేక విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు అన్ని భవిత సెంటర్లను సందర్శించాలని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులు తమ పనులు తాము చేసుకునే విధంగా నేర్పించాలని సూచించారు. భవిత కేంద్రాలకు కావాల్సిన ప్రత్యేక వస్తువులు, ఆట పరికరాలు, సౌకర్యాలు కల్పిస్తామని, అవసరాల వివరాలు సమర్పించాలన్నారు.

మేనరిక వివాహాల అనర్థాలు, గర్భిణిగా ఉన్నప్పుడు టీఫా స్కాన్ (TIFFA SCAN) వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భవిత కో-ఆర్డినేటర్ ఆంజనేయులు, క్వాలిటీ కో-ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఐ.ఈ.ఆర్.పి (IERP) లు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ :
