PALABHISHEKAM : బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య సమక్షంలో రూ. 200 కోట్ల నిధులతో బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామిలతోపాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ , అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
