GIRI PRADAKSHINA : వేలాల శ్రీ గట్టు మల్లన్న గిరిప్రదక్షిణ ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు శని వారం సాయంత్రం తెలిపారు. గురూజీ సురేష్ అత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో జరగబోయే నాలుగవ గిరి ప్రదక్షణకు వచ్చే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ మంచిర్యాల బస్టాండు నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారని, ఉదయం ఏడు గంటలకు మంచిర్యాల బస్టాండు నుంచి బయలుదేరి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లనుందన్నారు. ఈ బస్సులోనే గురూజీ వస్తారని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :