- పార్టీలో మార్పులకు జిల్లా అధిష్టానం శ్రీకారం
Congress: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఆ పార్టీ అధిష్టానం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థాగతంగా మరింత బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇందులో కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్ష పదవికి బండారి రమేష్‌ను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటన చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోలంపల్లి గ్రామంలో జరిగిన వేడుకలకు హాజరైన కవ్వంపల్లి రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతం, ఐక్యతకు పనిచేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు మండల అధ్యక్షుడిగా పనిచేసిన మోరపల్లి రమణారెడ్డి సేవలను గుర్తించిన జిల్లా అధిష్టానం, ఆయన్ను పార్టీలో ఇతర బాధ్యతలకు పంపించనున్నట్లు తెలిపింది. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, తిమ్మాపూర్
