BC Assocition
BC Assocition

BC Assocition: సమస్యల పరిష్కారం కోసం మోకాళ్ళపై నిరసన

BC Assocition: బీసీల  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్ర వారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ నామినేటెడ్ పదవులలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలని, బిసి ఫెడరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు చేయాలని, లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలని, కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్రత కల్పించాలి, ఒక్కొక్క కార్పొరేషన్ కు రూ. 2000 కోట్ల నిధులు మంజూరు చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, హత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు కూడా వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్, బీసీ గౌరవ అధ్యక్షులు కర్రే లచ్చన్న, డాక్టర్ బొడ్డు రఘునందన్, శాఖపురి భీమ్ సేన్, శ్రీపతి రాములు, కీర్తి బిక్షపతి, గుండ రాజమల్లు, బండ సతీష్, ఆరిందుల రాజేశం, రామగిరి రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి, సిరిపురం రాజయ్య, మగ్గిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *