- బీజేపీ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్
BJP Formation Day: గన్నేరువరం మండలంలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్(tipparthi nikesh) పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నికేష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party)ని 1980 ఏప్రిల్ 6న స్థాపించారు అని తెలిపారు. రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, నేడు 303 ఎంపీ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘనత కార్యకర్తలు దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన కృషికి ఫలితమని పేర్కొన్నారు.
“నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ, కర్తవ్య నిష్ఠతో ప్రజలు మూడోసారి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని అప్పగించారని అన్నారు.
తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నికేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ పని చేస్తుందని చెప్పారు. ప్రజలు నాయకుల క్రమశిక్షణను గుర్తించి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, జాలి శ్రీనివాసరెడ్డి, అటికం రామచంద్రం, బండి తిరుపతి, రాజిరెడ్డి, లక్ష్మీపతి , చంద్రశేఖర్, జగన్, లక్ష్మీరాజ్యం, సంతోష్, సాయి దీప్, వినయ్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, గన్నేరువరం