GATHERING OF ALUMNI : గంగాధర మండలం మధురానగర్ సురభి కాన్వెంట్ హైస్కూల్‌లో 2012–13 విద్యా సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, విద్యా దశలో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరువేశారు. అప్పటి గురువులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ చిప్ప వీరేశం మాట్లాడుతూ… తమ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చిప్ప వీరనర్సయ్య, టీచర్లు శ్రీనివాస్, సంతోష్ కుమార్, రమేశ్, రాములు, ఉమ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్