Traffic Rules : రోడ్డు ప్రమాదాల నివారణకు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ లోని ఎస్సార్పీ-3, ఎస్సార్పీ3ఏ గనిపై మంచిర్యాల ట్రాఫిక్ సీఐ బీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. రోడ్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. ద్వి చక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, ర్యాస్ డ్రైవింగ్ తో ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. అతి వేగంతో ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ఆస్కారం ఉందని చెప్పారు. కార్యక్రమంలో గని మేనేజర్ వెంకటేశ్వర్ రావు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
