- వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్న రైతు
- రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషిపై ప్రశంసలు
Former: పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన రైతు గాదరి రామయ్య వినూత్నంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జె తొర్రూరు సొసైటీ ద్వారా సాగు చేసిన ధాన్య రాశిపై రంగులతో ‘CM రేవంత్ రెడ్డి’, ‘MLA యశస్విని రెడ్డి’ అని రాసి, పక్కన త్రివర్ణపతాకం ఆకారంలో అలంకరించి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
రామయ్య మాట్లాడుతూ… ప్రభుత్వ మద్దతు ధర, వేగవంతమైన ధాన్యం కొనుగోలు విధానాలు తమకు ఆశాజనకంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి నేతృత్వంలో రైతులకు అందుతున్న సాయంతో సంతృప్తిగా ఉన్నామని వెల్లడించారు. స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఎప్పుడూ రైతుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
ఈ వినూత్న అభినందన ప్రదర్శన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రైతులు, గ్రామస్తులు దీన్ని సానుకూలంగా స్వీకరిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
-శెనార్తి మీడియా, పాలకుర్తి (జయశంకర్ భూపాలపల్లి)