INCENTIVE PRIZES : 2024-25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ వార్షిక ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. గురు వారం పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ, విద్యా సంస్థల అధినేత అప్పని తిరుపతిలు విద్యార్థులను శాలువాలతో సన్మానించి, మెమొంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సాహించడం వలన విద్యార్థులు ఉత్సాహంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ కుల బంధువులకు అండగా నిలువాలని సంఘం నాయకులను కోరారు. అనంతరం కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన విజ్ఞాన్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అప్పని తిరుపతిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెట్టం తిరుపతి, ప్రధాన కార్యదర్శి అంకతి తిరుపతి, కార్యవర్గ సభ్యులు తోట తిరుమలేష్, గోళ్ల రామన్న, ఆకిరెడ్డి శంకర్, అంకతి మల్లేష్, సభ్యులు ముత్యం బుచ్చన్న, ముత్యం నాగవర్మ, ముత్యం రాం నాారాయణ, కందుల తిరుపతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
