Singareni: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సంస్థ ఆస్తులపై అధికారుల నిఘా కరువైంది. కానీ అధికారుల తప్పిదానికి కింది స్థాయి ఉద్యోగులు బలి అవుతున్నారు. సింగరేణి బొగ్గు బావిలో కష్టపడి బొగ్గు తీస్తున్న కార్మికులు ఒక్క పెళ్ల బొగ్గు బయటికి తీసుకెళ్తే వారికి చార్జీషీట్లు ఇస్తున్న అధికారులు.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వర్కర్లు బ్యాగులు అపహరిస్తున్న చోద్యం చూస్తున్నారు. నస్పూర్ మండలంలోని సింగరేణి మనోరంజన్ స్టోర్‌లో శనివారం( ఈ నెల24న) రాత్రి అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రాత్రిపూట బ్యాగులు మాయం..
శనివారం రాత్రి 8 గంటల సమయంలో మనోరంజన్ స్టోర్‌లో బ్యాగులు దొంగతనంగా తరలిస్తుండగా ‘శెనార్తి మీడియా’ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనపై అక్కడున్న కాంట్రాక్టు వర్కర్ రవిని ప్రశ్నించగా, సివిల్ డిపార్ట్‌మెంట్ “సూపర్ వైజర్ వేదవ్యాస్ ఆదేశాల మేరకు బ్యాగులు తీసుకువెళ్తున్నాను” అని చెప్పాడు.
వేదవ్యాస్ వివరణ..
ఈ విషయమై వేదవ్యాస్ ను ప్రశ్నించగా తాను ట్రాన్స్‌ఫర్ అయి మూడు నెలలు అవుతుంది. తాను నస్పూర్ సివిల్ డిపార్ట్ మెంట్ లో సూపర్ వైజర్ గా ఉన్నప్పుడు స్టోర్ ఖాళీ చేయించి, శుభ్రం చేయించాలని చెప్పాను. నేను అక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యాక జరిగిన సంఘటన తో సంబంధం లేదు. అక్కడేం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుత సూపర్వైజర్ రాజశేఖర్ ఇలా
ప్రస్తుత సూపర్వైజర్ రాజశేఖర్, స్టోర్‌లో ఉన్న బ్యాగులపై తనకు సమాచారం లేదని, “సిబ్బంది తక్కువగా ఉండటంతో ప్రతిదీ పర్యవేక్షించడం సాధ్యం కాదు. పూర్తి వివరాలకు జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్ మెంట్ లో సంప్రదించండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
-మాకు సైతం తెలియదు… డీజీఎంలు (సివిల్ / పర్సనల్)..
సింగరేణి ఏరియా డీజీఎంల పర్యవేక్షణలో ఎలాంటి ఘటనలు జరగకుండా, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వారిపై అధికారాన్ని చూపిస్తారు. అలాంటి అధికారులు సింగరేణిలో అతిపెద్ద ప్రాంతమైన శ్రీరాంపూర్ ఏరియాలోని డీజీఎంలు (సివిల్ / పర్సనల్) సంస్థని కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టమవుతుంది. సింగరేణి కార్మికులకు ఇవ్వవలసిన గిఫ్టులను అధిక మొత్తంలో కొనుగోలు చేసి మిగిలిన బ్యాగులను నిర్లక్ష్యగా వదిలి వేస్తున్నారు. అదే అదునుగా భావించిన కాంట్రాక్ట్ వర్కర్స్ శనివారం రాత్రి సుమారు 8.20 గంటల ప్రాంతంలో వాటిని తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చడం, కాంట్రాక్టు వర్కర్స్ పై వేటు వేస్తూ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుంది.
డీజీఎం పర్సనల్ సీనియర్ పీఓను సంప్రదించమనడం, ఆ అధికారిని సంప్రదిస్తే నా పేరు మీకు ఎవ్వరు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు విచారణ జరిపి దీనికి సంబందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తప్పుడు చర్యలపై వ్యతిరేకత
బ్యాగులు మాయమైన తర్వాత కాంట్రాక్టు కార్మికులను బలి చేయడం అధికారుల దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో, అధికారులు విచారణ చేపట్టి నిస్పక్షపాతంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల డిమాండ్..
ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో బ్యాగులు మాయం కావడమే కాక, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యాయానికి గురైన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా తప్పు జరిగితే కాంట్రాక్ట్ కార్మికులపై వేటు వేస్తున్నారే తప్ప పర్యవేక్షించాల్సిన ఓవర్సీస్ సూపర్ వైజర్‌పై చర్యలు తీసుకోవడం లేదు.
ప్రజల ఆగ్రహం
సింగరేణి కార్మికుల శ్రమపై ఆధారపడిన సంస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
