- శంకరపట్నం మండలం కన్నాపూర్ లో హృదయాలను ద్రవింపజేసిన ఘటన
- శ్మశాన వాటికలో సౌకర్యాల లేమిపై గ్రామస్తుల ఆందోళన
Funeral : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి మృతితో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలోని శ్మశాన వాటికలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో అంత్యక్రియలు జరిపించిన ఘటన గ్రామస్తులను కలిచివేసింది.
వివరాలిలా ఉన్నాయి. కన్నాపూర్ గ్రామంలోని మూడు నెలల చిన్నారి అనారోగ్యంతో కన్నుమూయగాకుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ బాధను దిగమింగుకుంటూనే రాత్రి వేళ 8 గంటల ప్రాంతంలో స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించేందుకు వెళ్లారు.

అప్పటికే పుట్టెడు దు:ఖంలో ఆ కుటుంబాన్ని అక్కడి భయానక పరిస్థితి ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. ఓ వైపు వర్షం.. మరో వైపు చిమ్మని చీకటి ఆ కుటుంబాన్ని మరింత వేదనకు గురి చేసింది. శ్మశాన వాటికలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడం కష్టతరంగా మారింది. అక్కడికి వచ్చిన బంధువులంతా గొడుగులు పట్టుకొని తమ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయగా, ఆ వెలుతురులో అంత్యక్రియలు జరిపించారు.
ఒకవైపు పసిపాప మృతితో కుటుంబం తల్లడిల్లుతుండగా, మరోవైపు శ్మశానవాటికలో సౌకర్యాల లేమి ప్రజల మనసును కలచివేసింది. చిన్నారి అంత్యక్రియలు జరిగిన వేళ ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు.
గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “కనీసం శ్మశానవాటికలో విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితులు రాకూడదని అధికారులు, పాలకులకు విన్నించారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం
