DIVAKAR RAO
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

NDR WARNING : అవినీతి అధికారులకు హెచ్చరిక

  •  భవిష్యత్తులో మూల్యం తప్పదు
  •  మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

NDR WARNING : అవినీతికి పాల్పడుతున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది రాజకీయ సభ కాదని, అధికారులకు హెచ్చరిక ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ ప్రాంతం నుంచి ఎందుకు వెళ్లిపోయారన్న విషయం ప్రజలకు తెలుసునని, చేసిన పనికన్నా ఎక్కువ బిల్లులు అడిగారని, చేయని పనులకు బిల్లులు రాయాలన్న ఒత్తిడి వల్ల ఉద్యోగ భయంతోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థానికులు మాట్లాడుకుంటున్నారన్నారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలోని ప్రతి వెంచర్ దగ్గర డబ్బులు వసూళ్లు, దాడులు, తప్పుడు కేసులు నమోదు, భూములపై అక్రమాలు, మితిమీరిన అవినీతి వంటి చర్యలే ఆయన ఓటమికి కారణమవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం గులాబీ జెండానే ఎగురుతుందని, మంచిర్యాలలో కూడా గెలుపు బీఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

  • అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు…

నియోజక వర్గంలో అధికారులు అక్రమాలకు సహకరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో ఇసుక, మట్టి అక్రమంగా అమ్మకానికి సహకరించిన అధికార్కులను వదిలిపెట్టేది లేదని, అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అనుమతులు లేకుండా కూల్చేందుకు సహకరించిన వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. లక్ష్మీ టాకీస్, వెంకటేశ్వర థియేటర్ వద్ద జంక్షన్ లను కూల్చిన అధికారులపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

Ex MLA DIVAKAR RAO
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
  • అక్రమంగా కేసులు పెడుతున్నారు…

ఎమ్మెల్యేకు భయపడి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా పెట్టిన కేసులకు, చేసిన అరెస్టులకు సంబంధిత అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుందన్నారు. నియోజక వర్గంలో మందిపెల్లి శ్రీనివాస్, గడప రాకేష్, బేర సత్యనారాయణ, అంకం నరేష్, గొల్ల శ్రీనివాస్, సిరాజ్, కందుల ప్రశాంత్, దగ్గుల మధు, రావుల రాజేశం, అక్కల రవి, ఓరగంటి శ్రీకాంత్, మల్లేష్ రాపల్లి, నక్క తిరుపతి లపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని, మూడేళ్లు పనిచేసి మిగిలిన జీవితాన్ని ఇంట్లో కూర్చుంటారో లేక న్యాయంగా పనిచేస్తారో నిర్ణయం అధికారులదేనన్నారు. ప్రేమ్ సాగర్ ఓడిపోతే హైదరాబాద్‌కు పరిమితమవుతారు, కానీ అధికారులు ఎక్కడికి పోతారు..? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, టిబిజికెఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *