Basheerbhagh Martyrs: బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన వీరులకు సీపీఐ మండల కార్యవర్గం ఘనంగా నివాళులర్పించింది. గురువారం సీపీఐ కార్యాలయంలో మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ.. 2000 ఆగస్టు 28న టీడీపీ పాలనలో విద్యుత్ పోరాటాల సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అమరుల కుటుంబాలకు ఆ సమయంలో ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి, బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ వర్క్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రేగుల కుమార్, ట్రెజరర్ గోదారి లక్ష్మణ్, పార్టీ కార్యవర్గ సభ్యులు బూర్తుల శ్రీనివాస్, పిట్టల రామస్వామి, మార్కొండ నరసయ్య, సురేష్ కుమార్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, శంకరపట్నం
