- అధ్యక్షుడిగా మారం తిరుపతి యాదవ్
Yadav Charitable Trust: యాదవ చారిటబుల్ ట్రస్ట్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గాన్ని ప్రధాన ఎన్నికల అధికారి నుచ్చు శ్రీనివాస్ యాదవ్, సహాయ ఎన్నికల అధికారి పడాల సత్యనారాయణ గురువారం ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా మారం తిరుపతి యాదవ్, ఉపాధ్యక్షుడిగా చిలారపు పర్వతాలు, ప్రధాన కార్యదర్శిగా గొడుగు రాజకొమురయ్య, ఉప కార్యదర్శిగా పర్ష బక్కయ్య, కోశాధికారిగా మేకల మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ్మడబోయిన ఓదెల యాదవ్‌ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
గౌరవ ట్రస్టీలుగా గంట రాములు, సందనవేని రాజేందర్, పెగడ రమేష్, దారబోయిన నరసింహాం, మేకల కొమురయ్య, సల్పాల సుమలత, తాత రాజు యాదవ్, మల్లెత్తుల నాగరాజు ఎన్నికయ్యారు. నూతన కమిటీకి ధ్రువీకరణ పత్రాలను ప్రధాన ఎన్నికల అధికారి అందజేశారు.
నూతన అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన సభ్యులకు, సహకరించిన సంఘ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులు, గౌరవాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.
-శెనార్తి మీడియా, పెద్దపల్లి
