mrps
mrps

MRPS: కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

  • ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్

MRPS: మంచిర్యాల కలెక్టరేట్ లో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండడంతో కలెక్టర్ ను కలిసేందుకు వెళ్లారు.అక్కడ కలెక్టర్ లేకపోవడంతో ఆయన చాంబర్ లోకి వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మార్పీఎస్ నాయకుల నినాదాలతో గందరగోళనం నెలకొంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన  హామీ ప్రకారం దివ్యాంగుల పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదంటూ మండిపడ్డారు.

వికలాంగులకు నెలకు 6 వేల రూపాయల పెన్షన్, వితంతువులు, ఒంటరి మహిళలకు 4 వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆందోళన చేపట్టారు.

పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కలెక్టరేట్ గేట్లపై నుంచి దూకి లోపలికి ప్రవేశించిన నిరసనకారులు కలెక్టర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. అంతే కాకుండా కలెక్టర్ ఛాంబర్‌లో ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనను కొనసాగించారు. కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, పోలీసులు వారికీ సర్ది చెప్పి వారిని బయటికి పంపే ప్రయత్నం చేశారు. కలెక్టర్ ఛాంబర్‌ నుండి బయటకు వచ్చిన ఆందోళన కారులు ఏవో రాజేశ్వరరావుకి వినతిపత్రం అందజేసి పక్కనుండి బయటకు వెళ్లారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య మాదిగ, గద్దెల బానయ్య మాదిగ, రాజన్న, సుందిళ్ల మల్లేష్ మాదిగ, చుంచు శంకర్ వర్మ, మంతెన మల్లేష్ మాదిగ, గొడిసెల దశరథం, చిప్పకుర్తి మల్లేష్, వీహెచ్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, వృద్దులు, వికలాంగులు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *