- సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి
Mounish Reddy: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి అన్నారు. ఆదివారం మౌనీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి రోజు వారు అందిస్తున్న సేవలకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువేనని పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ కార్మికులు విశేష సేవలందించారని ప్రశంసించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ముడుపు ప్రేమందర్ రెడ్డి, కేదారేశ్వర రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం తలమడుగు మండల అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఆర్ఐ జాదవ్ కృష్ణ, మెప్మా డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, టౌన్ కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, సెక్షన్ క్లర్క్ నారాయణరెడ్డి, చంద్రశేఖర్, మౌనిష్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, ఆదిలాబాద్