- విచారణ పూర్తయి 20 రోజులైనా చర్యలేవి?
- ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
- ముగ్గురు మంత్రులకు బహిరంగ లేఖ
Knr Govt Hospital: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రూ.4.50 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ పూర్తయ్యి 20 రోజులు గడిచినా సంబంధిత వైద్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పేర్కొన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు తలమానికమైన ప్రభుత్వ దవాఖానలో నాలుగున్నర కోట్ల కుంభకోణం జరిగి ఇంతకాలం అవినీతి వైద్యులను కాపాడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తించడం ప్రజలకు బాధాకరమని చెప్పారు.
అవినీతికి పాల్పడిన డాక్టర్ కృష్ణ ప్రసాద్, అజయ్ ప్రసాద్, నవీన, మొహమ్మద్ అలీమ్, రత్నమాల, శ్రీనివాస్, జ్యోతి లపై ఇప్పటికే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విచారణ పూర్తయ్యి 20 రోజులు గడిచినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
అవినీతి వైద్యులను వెంటనే సస్పెండ్ చేసి, దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలని బండారి శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.

శెనార్తి మీడియా, కరీంనగర్
