- రూ. 42 వేల నగదు చోరీ
- పోలీసులకు సమాచారమిచ్చిన సిబ్బంది
- హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్న క్లూస్ టీం
Breaking News: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Thalamdugu PACS)లో చోరీ జరిగింది. ఆదివారం సైతం సొసైటీ సిబ్బంది స్థానిక రైతులకు ఎరువులు విక్రయించారు. ఆ వచ్చిన డబ్బుల్లో రూ. 42వేల నగదును సిబ్బంది లో కార్యాలయంలోని లాకర్ లో ఉంచి వెళ్లారు. సిబ్బంది సోమవారం ఉదయం సొసైటీకి వచ్చి చూసే సరికి షటర్ తాళాలు పగుల గొట్టి కనిపించాయి. గుర్తు తెలియని దొంగలు లాకర్ లోంచి రూ. 42 వేలు అపహరించారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నది.

కనిపించని భద్రత
తలమడుగు సహకార సంఘం పరిధిలో దాదాపు 5400 మంది సభ్యులు ఉన్నారు. ఏటా దాదాపు రూ. 10 కోట్ల మేరకు టర్నోవర్ జరుగుతున్నది. ఈ కార్యాలయంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. అయితే ఇవన్నీ గమనించే దుండగులు చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
-శెనార్తి మీడియా, తలమడుగు