SB Office Opening
SB Office Opening

SB Office Opening: కరీంనగర్‌లో ఎస్‌బీ నూతన కార్యాలయం

ప్రారంభించిన కమిషనర్ గౌష్ ఆలం

SB Office Opening: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఎస్‌బీ (స్పెషల్ బ్రాంచ్) నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఇంతకుముందు పోలీసు కమిషనర్ నివాసం పైభాగంలో ఉన్న ఎస్‌బీ కార్యాలయాన్ని, ఇప్పుడు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్మారక భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌష్ ఆలం పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

SB Office Opening
SB Office Opening

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నూతన భవనం ద్వారా ఎస్‌బీ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, తద్వారా వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలరని తెలిపారు. పోలీసు వ్యవస్థలో ఎస్‌బీ కీలక భాగమని, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు.
కమిషనర్ గౌష్ ఆలం నూతన భవనంలో ఎస్‌బీ కార్యాలయ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, యాదగిరిస్వామి, వాసాల సతీష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *