Helath Mision Kalajatha
అవగాహన కల్పిస్తున్న ఆరోగ్యశాఖ సిబ్బంది

Helath Mision Kalajatha:గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు

  • ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత

Helath Mision Kalajatha:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశాల మేరకు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొరివి చల్మా, వెంకటాపూర్, ముత్యంపేట్ గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలలో క్షయ నివారణ, కుష్టు నివారణ, మాతా-శిశు సంరక్షణ, 100 శాతం టీకాలు వేయించడంపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. హాస్పిటళ్లలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిచ్చి సిజేరియన్ ప్రసవాల తగ్గింపు నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సేవల లభ్యత, సికిల్ సెల్ ఎనీమియా నివారణ, రక్తహీనత సమస్యలపై అవగాహన కల్పి్స్తున్నారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దృష్టి సారించారు. కార్యక్రమాల్లో డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రతిజ్ఞా రాజారెడ్డి, సీహెచ్ఓ వసంతకుమారి, పోసాని ఆరోగ్య పరీక్షకులు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. పౌరులు వీటి గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు రావాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Helath Mision Kalajatha_1
అవగాహన కల్పిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *