- వీ హెచ్ పీ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముల సత్యం
VHP : హిందుత్వ రక్షణ కోసం, విశ్వ హిందూ పరిషత్ బలోపేతానికి హిందువులంతా ఏకమై బలోపేతం చేయాలని విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముల సత్యం అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విశ్వహిందూ పరిషత్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందువులు బలోపేతం కావడం సంఘటితంగా ఉండాలని సూచించారు. రాను రాను హిందువుల జనాభా తగ్గు ముఖం పడుతుందని, దీనితో హిందూ సమాజానికి ముప్పు ఏర్పడనుందన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ కండువా కప్పి పలువురిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రేవల్లి రాజలింగు, పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు కనకతార, నగర కార్యదర్శి కొండపర్తి సంజీవ్, మాతృ శక్తి సంయోజక ముత్యం పద్మ గణేష్, ముత్యం సంధ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.
- శెనార్తి మీడియా, మంచిర్యాల :

jai vhp