PADMASHALI EMPLOYEES : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సాయంత్రం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఐక్యంగా ఉండి, సమాజ సేవలో పాలు పంచుకోవాలని సూచించారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పొన్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బోగే సురేందర్, కార్యవర్గ సభ్యులు చెలిమల్ల వాసుదేవ మూర్తి, వేముల సత్యనారాయణ, బండి సత్యనారాయణ, వెంకటేష్, సిహెచ్ వెంకటేష్, బేతు కళావతి, శ్రీదేవి, రాజశేఖర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :