- ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

SAND DUNES IN GODAVARI : మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తరలింపుపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. శని వారం గోదావరి నదిలో ఏర్పడ్డ గుంతలను చూపిస్తూ ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో వందలాది లారీల ద్వారా ఇసుక, మట్టిని తరలించి ఆర్థిక లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాల కారణంగా గోదావరి నదిలో వర్షా కాలంలో నీటి ప్రవాహం పెరిగితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఇలాంటి అక్రమ చర్యలను చూసి కూడా దృష్టిపెట్టడం లేదని మండిపడ్డారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రజల ప్రాణ భద్రతకు కలిగే ప్రమాదాన్ని నివారించేందుకు పెద్ద పెద్ద గుంతలను పూడ్చాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
