Victory Hit : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కమర్షియల్ గా భారీ హిట్టు కొట్టారు. వెంకీ కెరీర్ లోనే భారీ హిట్ (Biggest Hit) చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. అలాగే పాన్ ఇండియా చిత్రాలు సాధించలేని రికార్డులను వెంకీ చిత్రం క్రియేట్ చేస్తున్నది. మెజార్టీ సెంటర్లలో ఈ చిత్రం #ఆర్ఆర్ఆర్, పుష్ప-2 రికార్డులను కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విజయనగరం వంటి సెంటర్ లో ఈ చిత్రానికి మొదటి వారం ఏకంగా రూ.2.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. #RRR చిత్రానికి ఇక్కడ మొదటి వారం రూ. 2 .17 కోట్లు వచ్చాయి. వచ్చాయి. అంటే ఈ ప్రాంతం లో #RRR సినిమా కంటే ఈ సినిమాకే భారీ మార్జిన్ లో టికెట్లు అమ్ముడు పోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడితే ఇలాంటి ఫలితాలే వస్తుంటాయని మరోసారి రుజువైంది. సినిమా విడుదలైన ఏడో రోజు కూడా ఈ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు వెంకీ ఫ్యాన్స్.
ఈ చిత్రం విడుదలై వారం పూర్తయిన సందర్భంగా వరల్డ్ వైడ్ గా ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందనేది తెలుసుకుందాం. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఏడో రోజు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 6.30 కోట్లు షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తున్నది. మొత్తం మీద ఏడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 89 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు రూ. 144 కోట్లు ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి రూ. 5 70 కోట్లు. ఓవర్సీస్ నుంచి రూ. 12 కోట్లు, మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ. 107 కోట్లకు పైగా షేర్ వసూళ్లు , రూ. 184 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
సీడెడ్ (Ceeded)లో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 14 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ ప్రాంతం నుంచి రూ. 23 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతుున్నారు. నైజాం(Nizam) లో రూ. 40 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ. 20 కోట్ల షేర్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ. 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గ్రాస్ రూ. 300 కోట్ల వరకు ఉండవచ్చు. కేవలం పాన్ ఇండియన్ హీరోలకు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో విక్టరీ వెంకటేష్ కూడా చేరిపోయాడు.