laila movie reiview
laila movie reiview

Laila: లైలా రిలీజ్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ రియాక్షన్ ఇదే

Laila: మాస్ కా దాస్(mass ka daas) విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ఫిబ్రవరి 14న విడుదలైంది.  అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ తో పాటు పొలిటికల్ గా పెద్ద దుమారమే రేగింది. ఇప్పటి దాకా తన సినిమాల విడుదల సందర్భంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నాడు. విష్వక్ సేన్..

ఇక లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం విష్వక్ సేన్(Vishwak Sen)  ప్రమేయం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంది.  కమెడియన్ పృథ్వీ (Comedian Prithvi)చేసిన వ్యాఖ్యలతో వైసీపీ యాక్టివిస్టులు చాలా తీవ్రంగా స్పందించారు.  ట్విట్టర్ లో బాయ్ కాట్ లైలా అంటూ నెగెటివ్ పోస్టులు పెట్టారు. ఇప్పటి దాకా కాంట్రవర్సీలు తన సినిమాలకు కలెక్షన్లు తీసుకు వస్తాయని ధీమాగా ఉన్న విష్వక్ ఈ సినిమా విషయంలో మాత్రం వెనక్కి తగ్గాడు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పాడు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సినిమాకు అపాదించవద్దని, సినిమాను చంపేయద్దని విన్నవించాడు. కానీ వైసీపీ ఫాలోవర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక లైలా సినిమా  ఫిబ్రవరి 14న విడుదల కాగా మరోసారి వైసీపీ అభిమానులు విరుచుకుపడ్డారు.

వైసీపీ(Ycp) అభిమానులు లైలా డిజాస్టర్ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిలో ఎంత మంది ఈ సినిమాని చూసి ఉంటారో చెప్పడం కష్టమే. కానీ ఆ పోస్టులు మాత్రం  టార్గెట్ లైలా అని మాత్రం స్పష్టమవుతున్నాయి.  వరెస్ట్ సినిమా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇలాంటి రొటీన్ స్క్రిప్ట్‌లను  ఇంకోసారి ఎంచుకోకు.. ఈ సినిమా చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాం.. చెత్త సినిమా.. అంటూ ట్వీట్లు పెడుతున్నారు.  అయితే చాలా మంది కావాలనే నెగెటివ్ కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తున్నది. కొంత మంది మాత్రం పర్వాలేదు అని..  ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.  ‘సోను మోడల్ క్యారెక్టర్ వేస్ట్.. లైలాగా చేసిన కామెడీ కాస్త బెటర్‘ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

‘బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ డైలాగులతో గట్టెక్కించాలనుకోవడం చాలా కష్టమని, లైలా నిలబడడం కష్టం’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.  కొంత కాలగా విష్వక్ సేన్ సినిమాలు ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ బాగానే ఉంటున్నా.. ప్లాఫులు మాత్రం  తప్పడం లేదు.  కెరీర్ ప్రారంభంలో ఉన్న విష్వక్ కనిపించడం లేదంటూ ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది.. చిత్రాల స్థాయిలో తర్వాత సినిమాలు ఉండడం లేదని చెబుతున్నారు.  మాస్ కా దాస్ ఇమేజ్ కోసం రొటీన్ స్టోరీలతో తన సినిమా బండిని లాగిస్తున్నాడని పేర్కొంటున్నారు.  ‘అశోకవనంలో, గామి’  లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన అవి మాత్రం సక్సెస్ కాలేదు.

సోను మోడల్ లాంటి వరెస్ట్ కారెక్టర్ ఇప్పటి దాకా ఎక్కడా చూసి ఉండరు.. అదే ఈ సినిమాను ముంచేసింది.  అంటూ ట్విట్టర్‌లో చర్చ నడుస్తున్నది. ఎప్పుడో ఔట్ డేటెడ్ అయిన స్టోరీ,  స్క్రీన్ ప్లే.. ఒక్క చోట కూడా నవ్వించలేకపోయిందని, అర్థం పర్థం లేని సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేశారని పోస్టులు పెడుతున్నారు.  కాంట్రవర్సీలతో సినిమాను నిలబెట్టుకోవాలనుకుంటే ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ పెద్దలు సూచిస్తున్నారు.

సోషల్ మీడియా(Social Media) లో ట్రోలర్స్, యాంటీ ఫ్యాన్స్  ధాటికి  పెద్ద హీరోల చిత్రాలే చతికిల పడుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న హీరోలు వివాదాలకు కాస్త దూరంగా ఉంటే మంచిదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. సినిమాలో కొత్తదనం ఉంటే.. ఈ చిత్రం విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరనే వాస్తవాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు.. మరి ఈ లైలా మీద ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ఇంకా నెగెటివిటీ సాగుతున్నది.  ఇక పూర్తిగా షోలు పడి, అసలు రివ్యూలు బయటకు వస్తే గానీ సినిమా నిలబడుతుందా?లేదా? అన్నది స్పష్టమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *