- జైపూర్ మండలం ఇందారంలో దారుణ హత్య
- తండ్రిని చంపిన తనయుడు
Jaipur: మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్ మండం ఇందారంలో నిద్రిస్తున్న తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశారు. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజన్న(45)ను అతని కొడుకు సాయి సిద్ధార్థ్ అర్ధరాత్రి సమయంలో కత్తితో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు జైపూర్ ఠాణాలో పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.
శెనార్తి మీడియా, మంచిర్యాల