Road Safety : ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బీ సత్యనారాయణ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం ఎస్సార్పీ-1 మైన్ పై సింగరేణి ఉద్యోగులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ మాట్లాడారు. వాహనదారులు తప్పకుండా వాహన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం మత్తులో నడపరాదని సూచించారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్సార్పీ-1 మేనేజర్ విజయ్, సేఫ్టీ ఆఫీసర్ రాజేష్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ రాజేందర్, 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల