- సెట్ లో అడుగు పెట్టాలంటే ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా ఆమె మాట వినాల్సిందే
Rama Rajamouli: దర్శకుధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్రకటించి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నది. ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయినట్లు సమాచారం. చాలా రహస్యంగా సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటాడు.
దర్శకుడు రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఏ ఒక్క విషయం కూడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతుంటాడు. ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా ఎవరైనా సరే సెట్లో అడుగు పెట్టాలంటే ముందు రాజమౌళి భార్య రమా రాజమౌళి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తమ సినిమాలోని ఏ ఒక్క అంశం కూడా ముందుగా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. స్వయంగా రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తే తప్ప మరో మార్గంలో మూవీ విషయాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడుతుంటారు. అయితే ఈ విషయంలో రాజమౌళికి అండగా నిలుస్తున్నది మాత్రం రమా రాజమౌళినే.
- రాజమౌళి సినిమా అంటే ఫ్యామిలీ ప్యాకేజీ
రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే ఫ్యామిలీ ప్యాకేజీ కింద ఆ కుటుంబానికి నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిందే అనే టాక్ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ విషయాన్ని రాజమౌళి కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాకు కథ అందిస్తాడు. సోదరుడు కీరవాణి సంగీతం అందిస్తాడు. ఇక రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారు. కీరవాణి భార్య శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంటారు. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లోనే ఉన్నాడు. రైటింగ్ టీమ్ లో మరో సోదరుడు కాశీ కూడా ఉంటాడు. ఇలా ప్రతీ వింగ్ లో రాజమౌళి కుటుంబమే కనిపిస్తుంటుంది.

ఇక రమా రాజమౌళి షూటింగ్ కంటే ముందుగానే సెట్ వద్ద ఉంటుంది. అన్నీ ఆమె స్వయంగా చెక్ చేసుకుంటుంది. సెట్ లోకేషన్ ను ముందుగా తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఆమె స్వయంగా సెక్యూరిటీ వింగ్ వద్ద పర్యవేక్షణ చేస్తుంటుంది. ప్రొడక్షన్ బాయ్ నుంచి మొదలు ప్రతీ ఒక్కరిని చెక్ చేశాకే సెట్లోకి అనుమతిస్తుంది. ఎవరైనా సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకువస్తే అరిచేస్తుంది. ఆ ఫోన్లు పగలగొడుతుంటుందని యూనిట్ సభ్యులు చెబుతుంటారు. అంత స్ట్రిక్ట్ గా ఉంటారు రమా రాజమౌళి.
అంతటి స్టార్ డైరెక్టర్ భార్య, కాస్ట్యూమ్ డిజైనర్ తనది కాని వింగ్ లో ఇలా సెక్యూరిటీని పర్యవేక్షించడం.. మరీ ఇంత కఠినంగా వ్యవహరించడంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. ఇవి తన దాకా వచ్చినా రాజమౌళి వాటిని పట్టించుకోడు. ఆమె ఏం చేసినా తాము చేస్తున్న సినిమా కోసమేనని, అనవసరమైన విషయాలను లోనికి రానివ్వదని చెబుతుంటాడు ఈ దర్శకధీరుడు. ఆమె సపోర్ట్ వల్ల తాను ఏ ఆటంకం లేకుండా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయగలుగుతున్నానని చెబుతుంటాడు.
ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకు కూడా అవే కండీషన్లు పెట్టినట్లు తెలుస్తున్నది. ఆమె స్వయంగా చెక్ చేసి యూనిట్ సభ్యులను లోపలికి పంపిస్తున్నట్లు సమాచారం.