Financial Assistance : మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Financial Assistance :అకాల మరణం చెందిన తమ మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి స్నేహబంధాన్ని చాటారు. హౌసింగ్ బోర్డు ఓపెన్ జిమ్‌ సభ్యుడు పోతరవేణి మహేశ్ ఈ నెల 22వ తేదీన మరణించారు. మహేశ్ మిత్రులు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని సంకల్పించారు. తలా కొంత పోగేసి రూ.75వేలు జమ చేశారు. ఆ మొత్తాన్ని మహేశ్ కుటుంబానికి అందజేసి ఔదార్యాన్ని చాటారు. బాధితుడి కుటుంబ సభ్యులు హౌజింగ్ బోర్డ్ ఓపెన్ జిమ్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

  – శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *