- రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
Police: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు జిల్లా ఆర్మ్‌డ్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. సాయుధ దళాల వార్షిక శిక్షణ (మోబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు ఆర్ముడ్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని, అదే ఉత్సాహంతో భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికో సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఆర్మ్‌డ్ రిజర్వ్/ సాయుధ దళాలు యాన్యువల్ మొబిలైజేషన్ శిక్షణలో బాగంగా సిబ్బందికి, అధికారులకు ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ఆపరేషన్, ఫైరింగ్, నాకాబందీ, పికెట్స్, వీఐపీ బందోబస్తు విధులు, ప్రిసనర్, క్యాష్ ఎస్కార్డ్స్, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థితుల క్రమంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ,శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవడానికి మోబిలైజేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
అధికారులు, సిబ్బంది నిత్యాజీవితంలో వ్యాయామం,యోగా భాగం చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి, ఆర్ఎస్ఐలు శ్రవణ్ యాదవ్, రమేశ్, సాయి కిరణ్, దిలీప్, రాజు, జునైద్, సిబ్బంది ఉన్నారు.
– శెనార్తి మీడియా, సిరిసిల్ల