PDS RICE : నిర్మల్ జిల్లాలోని బైంసా, లక్ష్మణ చందా మండలాల్లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం (PDS RICE) పట్టుబడటంతో జిల్లా కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల శాఖ (DCSO) ఆదేశాల మేరకు ఎన్ ఫోర్స్ మెంటు (ENFORCEMENT) అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో రేషన్ దుకాణాల(RATION SHOPS)ను తనిఖీ చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం (PDS RICE) పక్కదారి పట్టకుండా అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. రేషన్ షాపులను తనిఖీ చేసి స్టాకు(STOCK) నిలువలు, రికార్డు(RECORDS)లను పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఫౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ (ENFORCEMENT) అధికారులు కార్తీక్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
– శెనార్తి మీడియా, నిర్మల్ :